Bheemlanayak: ‘భీమ్లానాయక్‌’ సూపర్‌ సక్సెస్‌.. పవన్‌కల్యాణ్‌ గ్రాండ్‌ పార్టీ

బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న సరికొత్త పవర్‌ప్యాక్డ్‌ మూవీ ‘భీమ్లానాయక్‌’. ప్రస్తుతం ఈ చిత్రబృందం సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. తమకు బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌ చెబుత...

Published : 27 Feb 2022 12:33 IST

హైదరాబాద్‌: బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న పవర్‌ప్యాక్డ్‌ మూవీ ‘భీమ్లానాయక్‌’. ప్రస్తుతం ఈ చిత్రబృందం సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. తమకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌ చెబుతూ శనివారం ఉదయం టీమ్‌ మొత్తం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఇదిలా ఉండగా.. నిన్న సాయంత్రం ‘భీమ్లానాయక్‌’ టీమ్‌ మొత్తానికి పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కలిసి ఓ గ్రాండ్‌ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌, సింగర్స్‌ అందరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక, సినిమా విషయానికి వస్తే ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, తమన్‌ స్వరాలు సమకూర్చారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని