Jayamma Panchayathi: తిరిగివ్వకుంటే.. ఒక్కొక్కళ్లకి ఉంటాది

‘‘మనం ఎవలెవళ్లకైతే ఈడ్లేశామో వాళ్లందరూ మనకి తిరిగి ఇవ్వాల్సిందే. లేదంటే సుట్టాల్లేరు. ఊళ్లోవాళ్లు లేరు. ఒక్కొక్కళ్లకి ఉంటాది’’ అంటూ సీరియస్‌గా హెచ్చరిస్తోంది జయమ్మ. మరి ఆమె ఎవరు? ఊరి వాళ్లతో ఆమె పెట్టుకున్న..

Updated : 17 Apr 2022 08:20 IST

‘‘మనం ఎవలెవళ్లకైతే ఈడ్లేశామో వాళ్లందరూ మనకి తిరిగి ఇవ్వాల్సిందే. లేదంటే సుట్టాల్లేరు. ఊళ్లోవాళ్లు లేరు. ఒక్కొక్కళ్లకి ఉంటాది’’ అంటూ సీరియస్‌గా హెచ్చరిస్తోంది జయమ్మ. మరి ఆమె ఎవరు? ఊరి వాళ్లతో ఆమె పెట్టుకున్న పంచాయితీ ఏంటి? తెలియాలంటే ‘జయమ్మ     పంచాయితీ’ చూడాల్సిందే. వ్యాఖ్యాత,   నటి సుమ కనకాల టైటిల్‌ పాత్రలో  నటించిన చిత్రమిది. కలివరపు విజయ్‌ కుమార్‌ తెరకెక్కించారు. బలగ ప్రకాష్‌ నిర్మాత. దేవీ ప్రసాద్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హీరో పవన్‌ కల్యాణ్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఉత్తరాంధ్రలోని గ్రామీణ వాతావరణంలో సాగే చిత్రమిది. ‘‘రా బావా.. మా ఊర్లో పంచాయితీ సూద్దువ్‌ గానీ, ఏ ఊర్లో జరగని ఎరైటీ గొడవ ఒకటి జరుగుతోంది’’ అంటూ ఓ వ్యక్తి చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది. జయమ్మ తనకొచ్చిన    సమస్యపై పంచాయితీ పెట్టడం.. గ్రామ పెద్దలు ఆమె సమస్యని తేలికగా తీసుకోవడం, దీంతో జయమ్మ ఎదురు తిరగడం.. ఇలా ఆద్యంతం ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. దీంట్లో ఓ చక్కటి ప్రేమకథ దాగి ఉన్నట్లు ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి అర్థమవుతోంది. ‘‘ఎవరు వల్ల సెడ్డావురా వీరన్న అంటే నోటి వల్ల సెడ్డానురా కాటమరాజా’’ అంటూ     ట్రైలర్‌లో ఉత్తరాంధ్ర మాండలికంలో  సుమ చెప్పిన డైలాగ్‌లు నవ్వులు   పూయించాయి. ఈ చిత్రానికి కీరవాణి స్వరాలందించారు. కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అనూష్‌ కుమార్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని