Payal Rajput: ‘బంగార్రాజు’లో ఐటమ్‌ భామగా?

నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చేయనున్నారు. సినిమా షూటింగ్‌ని జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్రంలోని ఓ ప్రత్యేక గీతం కోసం ‘ఆర్‌ఎక్స్ 100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ని తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. 

Updated : 21 May 2021 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నాగార్జున కథానాయకుడిగా, కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చేయనున్నారు. సినిమా షూటింగ్‌ని జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్రంలోని ఓ ప్రత్యేక గీతం కోసం ‘ఆర్‌ఎక్స్ 100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ని తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నారు. సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అందాల సుందరి పాయల్‌ తెలుగులో వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’, రవితేజ సరసన ‘డిస్కోరాజా’ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ‘ఏంజెల్‌’ అనే చిత్రంలో చేస్తోంది. పాయల్‌ నిత్యం సామాజిక మాధ్యమాల వేదికగా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. అప్పడప్పుడు హాట్ ఫొటోషూట్స్‌తో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని