Payal Rajput: పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని!

సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే కథానాయికల్లో పాయల్‌ రాజ్‌పుత్‌ ఒకరు. తాను అస్వస్థతకు గురైనట్టు తెలియజేస్తూ అభిమానులకు షాక్‌ ఇచ్చారు.

Published : 21 Mar 2023 20:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను అస్వస్థతకు గురయ్యానంటూ నటి పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) అభిమానులకు షాక్‌ ఇచ్చారు. కిడ్నీ ఇన్ఫెక్షన్‌ సోకిందని, ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. చికిత్స తీసుకున్నప్పటి ఫొటో షేర్‌ చేశారు. ‘‘నేను చాలా తక్కువ నీరు తాగేదాన్ని. అందుకే కిడ్నీ ఇన్ఫెక్షన్‌కు గురైంది. ఈ సందర్భంగా నీరు ఎక్కువగా తాగాలని మీ అందరికీ గుర్తుచేస్తున్నా. ప్రస్తుతం యాంటిబయోటిక్స్‌ చివరి డోస్‌ తీసుకున్నా. అంతా సెట్‌ అయింది. మనకెదురైన అవాంతరాలను అధిగమించగలగాలి. ఎంత ఇబ్బంది ఉన్నా నా తదుపరి సినిమా చిత్రీకరణను మాత్రం నేను ఆపలేదు. ఆ ప్రాజెక్టు నాకెంతో ప్రత్యేకం’’ అని పేర్కొన్నారు.

ఆమె ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’ (Mangalavaram). అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆంధ్రప్రదేశ్‌లోని రామచంద్రాపురం పరిసరాల్లో జరుగుతోంది. సూపర్‌హిట్‌ చిత్రం ‘ఆర్ఎక్స్‌ 100’ (RX 100) తర్వాత పాయల్‌- అజయ్‌ కాంబోలో రూపొందుతుండడంతో ‘మంగళవారం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విభిన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు