
Updated : 28 Apr 2021 16:01 IST
PelliSandaD ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
హైదరాబాద్: శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా జంటగా నటిస్తున్న చిత్రం ‘పెళ్లి సంద..D’. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా, రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘అడవి రాముడు’ విడుదలై బుధవారంతో 44 ఏళ్లు, అలాగే ఆయన సమర్పణలో వచ్చిన ‘బాహుబలి-2’ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పెళ్లి సంద..D’ చిత్రం నుంచి మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది.
‘ప్రేమంటే ఏంటి’ అంటూ సాగే ఈ పాటలో రోషన్, శ్రీలీలాల హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఫీల్ గుడ్ మెలోడిగా రూపుదిద్దుకున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. హరిచరణ్, శ్వేతాపండిట్ ఈ పాటను ఆలపించారు.
ఇవీ చదవండి
Tags :