త్వరలో థియేటర్లలో పెళ్లిసంద‘డి’

శ్రీకాంత్‌ కథానాయకుడిగా కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇప్పుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నయా పెళ్లి సంద‘డి’ షురూ అయిన సంగతి తెలిసిందే. దీనికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు....

Published : 13 Jan 2021 11:44 IST

హైదరాబాద్‌: శ్రీకాంత్‌ కథానాయకుడిగా కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇప్పుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నయా పెళ్లి సంద‘డి’ షురూ అయిన సంగతి తెలిసిందే. దీనికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారంతో ‘పెళ్లి సందడి’ విడుదలై 25 ఏళ్లు అయిన సందర్భంగా కె.రాఘవేంద్రరావు ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘పెళ్లి సందడిని నా కెరీర్‌లో, శ్రీకాంత్‌ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణికి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్‌  ప్రసాద్‌లకు నమస్కరిస్తున్నాను. ఈ పాతికేళ్ల సంబరాల్ని రెట్టింపు చేయడానికి పెళ్లిసంద‘డి’ సినిమాని శ్రీకాంత్‌ వారసుడు రోషన్, శ్రీలీలతో చేస్తున్నాం. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే థియేటర్లో కలుద్దాం’’అని ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని