Cinema news: ఐదు భారీ ప్రాజెక్టులు వ‌రుస క‌ట్ట‌నున్నాయి

ఇప్పుడిప్పుడే చిత్ర ప‌రిశ్ర‌మ కొంచెం కోలుకుంటోంది. కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల‌ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌య్యాయి.

Published : 18 Jun 2021 01:27 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఇప్పుడిప్పుడే చిత్ర ప‌రిశ్ర‌మ కొంచెం కోలుకుంటోంది. కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల‌ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌య్యాయి. త్వ‌ర‌లోనే కొన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మ నుంచి రాబోతున్న ఐదు భారీ ప్రాజెక్టుల వివ‌రాల్ని పంచుకుంది ప్ర‌ముఖ నిర్మాణ, పంపిణీదారు సంస్థ పెన్ స్టూడియోస్‌. ఈ జాబితాలో ‘బెల్ బాట‌మ్‌’, ‘గంగూబాయి క‌తియావాడి’, ‘ఎటాక్‌’, ‘ఆర్ఆర్ఆర్’ (హిందీ), ‘అప‌రిచితుడు’ హిందీ రీమేక్ ఉన్నాయి.

అక్ష‌య్ హీరోగా తెర‌కెక్కిన ‘బెల్ బాట‌మ్’ జులై 27న విడుద‌ల కానుంది. మిగిలిన చిత్రాల విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తోన్న చిత్రమే ‘గుంగూబాయి’. జాన్ అబ్ర‌హాం హీరోగా ‘ఎటాక్‌’ని తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు ల‌క్ష్య‌రాజ్ ఆనంద్‌. రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ హిందీ ప్ర‌సార హ‌క్కుల్ని పెన్ స్టూడియోస్ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. విక్ర‌మ్ హీరోగా త‌మిళంలో రూపొందిన ‘అప‌రిచితుడు’ హిందీ రీమేక్ రాబోతుంది. ఈ రీమేక్‌ని ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించ‌నున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని