‘హాటెస్ట్‌ వెజిటేరియన్‌ సెలబ్రిటీ’గా సోనూసూద్...

కరోనా కాలంలో ఎంతో మంది వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారీ రియల్‌ లైఫ్‌ హీరో సోనూసూద్‌.

Updated : 25 Oct 2022 12:08 IST

ముంబయి: కరోనా కాలంలో ఎంతో మంది వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారీ రియల్‌ లైఫ్‌ హీరో సోనూసూద్‌. కష్టం అంటే చాలు, ఆపద్బాంధవుడిలా ఆదుకునే కరుణామయమూర్తి ఈ రీల్‌ లైఫ్ విలన్‌. ఇటీవలే కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ-రిక్షాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ‘ఉద్యోగవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యమని నేను నమ్ముతాను’ అని ఆయన చెప్పారు.  తాజాగా పెటా ఇండియా ఆయన సేవలకు అభినందనీయంగా ‘హాటెస్ట్ వెజిటేరియన్‌ సెలబ్రిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును అందించారు. ఇదే విషయమై ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో ‘ధన్యవాదాలు, పెటా ఇండియా’ అంటూ ఓ గ్లాస్‌ ట్రోఫీని జత చేశారు.  

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని