Phalana Abbayi Phalana Ammayi: లండన్‌లో అబ్బాయి అమ్మాయి

నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా... శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి’. టి.జి.విశ్వప్రసాద్‌, దాసరి పద్మజ  నిర్మాతలు. ఈ సినిమా  చిత్రీకరణ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. నాయకానాయికలు,

Updated : 03 Jul 2022 06:46 IST

నాగశౌర్య (NagaShaurya), మాళవిక నాయర్‌(Malavika Nair) జంటగా... శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi). టి.జి.విశ్వప్రసాద్‌, దాసరి పద్మజ  నిర్మాతలు. ఈ సినిమా  చిత్రీకరణ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. నాయకానాయికలు, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ‘‘నాగశౌర్య - మాళవిక నాయర్‌ జోడీ ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో అలరించింది. నాగశౌర్య - శ్రీనివాస్‌ అవసరాల ‘కలయికలో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలొచ్చాయి. విజయవంతమైన చిత్రాల నాయకానాయికలు, దర్శకుడు కలిసి చేస్తున్న ఈ సినిమా ఆసక్తికరమైన కథతో... ఇంటిల్లిపాదినీ  అలరిస్తుంద’’ని చిత్ర వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని