Sridevi Drama Company: రంభ.. ఊర్వశి.. మేనక ఈ డ్యాన్స్‌ చూస్తే కెవ్వు కేక!

శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫాల్గుణి, మానసి, శర్వారిలు తమ డ్యాన్స్‌లతో అదరగొట్టారు.

Published : 20 Sep 2021 01:42 IST

హైదరాబాద్‌: వెండితెరపై ఐటమ్‌ సాంగ్స్‌కు ఉండే క్రేజే వేరు. ఆ పాట పాడేవారు, అందులో నర్తించే వారి బట్టి కూడా ఆ సాంగ్స్‌ పాపులర్‌ అవుతాయి. అలా అలరించిన, ఇప్పటికీ అలరిస్తున్న పాటలే ‘జరమొచ్చింది..’, ‘బ్యాడ్‌ బాయ్స్‌..’ ‘దిగు దిగు నాగ..’. చివరి పాట ఇటీవల బాగా ట్రెండ్‌ అవుతోంది. మరి ఈ పాటలకు రంభ, ఊర్వశి, మేనకలాంటి అప్సరసలు నర్తిస్తే చూడటానికి రెండు కళ్లు చాలవు కదా! ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వేదికపై అదే మేజిక్‌ జరిగింది.

ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ద్వారా బుల్లితెర తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది ఈటీవీ. ఈ ఆదివారం కూడా అదిరే ప్రదర్శనలతో అలరించింది. ఫాల్గుణి, మానసి, శర్వారిలు తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ముఖ్య అతిథులైన ప్రేమ, ఇంద్రజలతో పాటు, కార్యక్రమంలో పాల్గొన వారు కూడా ఆ ముగ్గురి డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. అలరించేలా సాగిన ఆ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ను మీరూ చూసేయండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని