Phone Bhoot: కత్రినా భూత విన్యాసాలు

కత్రినా కైఫ్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, ఇషాన్‌ ఖట్టర్‌, జాకీష్రాఫ్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్‌ కామెడీ ‘ఫోన్‌ భూత్‌’. అందాల భామ కత్రినా కైఫ్‌ ఇందులో భూతంగా నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Updated : 12 Oct 2022 07:20 IST

త్రినా కైఫ్‌  (katrina Kaif), సిద్ధాంత్‌ చతుర్వేది (Siddhant Chaturvedi), ఇషాన్‌ ఖట్టర్‌ (Ishaan), జాకీష్రాఫ్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్‌ కామెడీ ‘ఫోన్‌ భూత్‌’ (Phone Bhoot). అందాల భామ కత్రినా కైఫ్‌ ఇందులో భూతంగా నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గుర్మీత్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఫర్హాన్‌ అఖ్తర్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. శాపం కారణంగా భూతంగా మారిన కత్రినా కైఫ్‌.. తనకి మోక్షం కలిగి మామూలుగా మారడానికి ఏం చేసింది? భూతాలంటే అమితాసక్తి చూపించే సిద్ధాంత్‌ చతుర్వేది, ఇషాన్‌ ఖట్టర్‌లతో తను ఎలాంటి విన్యాసాలు చేయిస్తూ హాస్యం పండించిందో ఇందులో వినోదాత్మకంగా చూపించారు. నవంబరు 4న ఈ చిత్రం విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని