పింక్ టు వకీల్‌సాబ్ వయా నేర్కొండపార్వై
POWERSTAR PAWANKALYAN థియేటర్లో స్క్రీన్‌పై ఈ పేరు చూడడం కోసం, ఈలలు వేయడం కోసం అభిమానులు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు...
ఈ ప్రాజెక్ట్‌లోకి పవన్ మామూలుగా రాలేదు
ఇంటర్నెట్‌డెస్క్: పవర్ స్టార్ పవన్‌కల్యాణ్.. థియేటర్లో స్క్రీన్‌పై ఈ పేరు చూసి ఈలలు వేయడం కోసం అభిమానులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు సరైన సమాధానం చెప్పేందుకు ఏప్రిల్ 9న ఆయన ‘వకీల్‌సాబ్’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కమర్షియల్ హంగులకు దూరంగా మహిళా సాధికారతే ప్రధానాంశంగా తెరకెక్కిన ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా రానుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయగా అక్కడా ప్రశంసలు అందుకుంది. కాగా, మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వకీల్‌సాబ్’ విశేషాలపై ఓ లుక్కేయండి..!
‘పింక్’ అలా..!
సమాజంలో మహిళల పట్ల కొంతమంది వ్యక్తులకు ఉన్న చులకన భావాన్ని, దానివల్ల స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘పింక్’. సుజిత్ సర్కార్, రితేష్ షా రచించిన ఈ కథకు అనిరుద్ రాయ్ చౌదరి తన దర్శకత్వంతో ప్రాణం పోశారు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేని ఈ కోర్టు రూమ్ డ్రామాలో అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతి కల్హరి, ఆండ్రియా ప్రధాన పాత్రలు పోషించారు. విభిన్నమైన కథా చిత్రాలతో తరచూ ప్రేక్షకుల్ని మెప్పించే అమితాబ్, తాప్సీ ఈ సినిమాలో భాగం కావడంతో ప్రారంభంలో దీనిపై ఓ మోస్తరుగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ విడుదలయ్యాక అవి రెట్టింపయ్యాయి. కథతోపాటు సాగే రెండు పాటలు మినహాయించి ఇందులో ఎలాంటి రొమాన్స్, ఇతర కమర్షియల్ హంగులు ఉండవు. ఎక్కువ భాగం కథ కోర్టు రూమ్‌లోనే సాగుతోంది. అలాగే, బిగ్‌బి వయసు పైబడిన వ్యక్తిలా కనిపిస్తారు. ఆయనకు వివాహమైనట్లు చూపిస్తారు.. కానీ సతీమణి పాత్రకు అంత ఎక్కువ పరిధి ఉండదు. అలాగే కోర్టు సీన్లు.. బిగ్‌బి, తాప్సీల నటన హైలైట్‌గా నిలిచాయి. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.వందకోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా.
‘నేర్కొండపార్వై’ ఇలా..!
కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉంటారు కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్. అలా ఆయన చేసిన ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి కూడా. బాలీవుడ్లో ‘పింక్’ మంచి విజయం సాధించడంతో ఆ సినిమాని తమిళంలోనూ రీమేక్ చేయాలని భావించారు నిర్మాత బోనీకపూర్. ఇలాంటి కథకు అజిత్ అయితే చక్కగా సరిపోతాడని నిర్మాత ఆయనని సంప్రదించాడు. అలా వచ్చిందే ‘నేర్కొండపార్వై’. కోలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా కథలో కొన్ని స్వల్ప మార్పులు చేశారు దర్శకుడు హెచ్.వినోద్. శ్రద్ధాశ్రీనాథ్, అభిరామి వెంకటాచలం, ఆండ్రియా కీలకపాత్రలు పోషించారు. ఇందులో అజిత్ మధ్య వయస్కుడిగా, గర్భవతి అయిన భార్యను(విద్యాబాలన్) కోల్పోయిన భర్తగా కనిపిస్తారు. అతికోపం అనే మానసిక రుగ్మతతో ఇబ్బందిపడుతున్న వ్యక్తిగా అజిత్‌ని చూపించారు. సినిమా ప్రారంభంలో వచ్చే ఓ క్లబ్ సాంగ్, అజిత్-విద్యాల మధ్య వచ్చే ఓ పాట ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగే అజిత్ స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకుని రెండు ఫైట్ సీక్వెన్స్‌లు కూడా చిత్రీకరించారు. సుమారు 150 కోట్ల వరకూ ఈ సినిమా వసూలు చేసినట్లు అంచనా.
‘వకీల్‌సాబ్’ ఎలా..!
‘పింక్’, ‘నేర్కొండపార్వై’ విజయాలు అందుకున్న తరుణంలో ‘వకీల్‌సాబ్’ పేరుతో అదే కథను తెలుగులోకి రీమేక్ చేశారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకుని మూలకథలో ఎలాంటి మార్పులు చేయకుండా కొన్ని కమర్షియల్ హంగుల్ని ఇందులో చేర్చారు దర్శకుడు వేణు శ్రీరామ్. బాలీవుడ్, కోలీవుడ్‌లో చూపించని విధంగా ఇందులో పవన్‌ని యంగ్ లుక్‌లో చూపించారు. అలాగే పవన్-శ్రుతిహాసన్‌ల మధ్య ఓ లవ్‌ట్రాక్ ఉండనుంది. ట్రైలర్ చూస్తే ఫైట్ సీక్వెన్స్ కూడా భారీగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. మరోవైపు ‘పింక్’, ‘నేర్కొండపార్వై’లో లేని విధంగా పవన్‌కు వ్యతిరేకంగా వాదించే న్యాయవాది పాత్రలో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ని తీసుకోవడం, కోర్టు రూమ్‌లో వాళ్లిద్దరి మధ్య జరిగే మాటల యుద్ధం చూసి ప్రేక్షకులు ఇప్పటికే ఈలలు వేస్తున్నారు. ఇక ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
పవన్ అలా వచ్చారు...!
‘‘నేర్కొండపార్వై’ విడుదలకు ముందు ఆ సినిమా ట్రైలర్‌ని ఓ సారి బోనీకపూర్ నాకు పంపించారు. ఆ వీడియో చూస్తున్నంతసేపు హీరో పాత్రలో పవన్‌కల్యాణే నాకు కనిపించారు. ఆ ట్రైలర్‌ని నేను హరీశ్ శంకర్‌కు పంపించగా.. ‘ఇది కల్యాణ్ గారికి కరెక్ట్‌గా సెట్ అవుతుంది’ అని అన్నాడు. దాంతో పవన్‌తో తప్పకుండా ఈ సినిమా చేయాలనే బలం నాలో మరింత పెరిగింది. ‘నేర్కొండపార్వై’ విడుదలై.. హిట్టైన తర్వాత ‘అల.. వైకుంఠపురములో..’ షూట్ లొకేషన్‌కు వెళ్లి త్రివిక్రమ్‌ని కలిశా. ఈ సినిమా గురించి ఆయనకు చెప్పి పవన్ అపాయింట్మెంట్ ఇప్పించమని కోరాను. దానికి త్రివిక్రమ్ ఓకే అని ఓరోజు పవన్‌తో మీటింగ్ ఏర్పాటు చేయించారు. పవన్‌ని కలిసి కథ చెప్పాను. ఆయన వెంటనే ఓకే అన్నారు. ఆ తర్వాత దర్శకుడిగా వేణుశ్రీరామ్ని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నాం. ‘పింక్’ రైటర్స్, డైరెక్టర్స్, బోనీకపూర్, హరీశ్ శంకర్, త్రివిక్రమ్, వేణుశ్రీరామ్.. వీళ్ల వల్లే పవన్‌తో సినిమా చేయాలనే నా డ్రీమ్ తీరింది’’ అని దిల్‌రాజు చెప్పారు.
వకీల్‌సాబ్ విశేషాలు..
* హీరోయిజాన్ని చూపించే సన్నివేశాలు
* ఫైట్ సీక్వెన్స్‌లు
* యంగ్ లుక్‌లో పవన్ కల్యాణ్. పవన్-శ్రుతి లవ్ ట్రాక్
* నాలుగు పాటలు
* పవన్-ప్రకాశ్ మధ్య వాదోపవాదాలు
* నివేదా, అంజలి, అనన్య నటన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది? -
Telugu Movies: రిపబ్లిక్ డే ‘డబ్బింగ్’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్’ సింగిల్‌గా..?
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం.. -
Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్’, ‘సలార్’ హిట్లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ.. -
Pallavi prashanth: ‘బిగ్‌బాస్’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!
bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ సాగిందిలా..! -
Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్ తీరిలా!
ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్? ఏది ఫట్? చూసేయండి.. -
Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
ప్రముఖ హీరో వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్