PKSDT: పవన్‌ కల్యాణ్‌- సాయి ధరమ్‌తేజ్‌ కాంబో.. ఆసక్తికర అప్‌డేట్‌ ఇదుగో

పవన్ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కిస్తున్న సినిమా నుంచి అప్‌డేట్‌ వచ్చింది. అదేంటంటే?

Published : 28 Feb 2023 19:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరోలు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ  చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్‌ సాగుతోన్న ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. అందులో కీలక పాత్రలు పోషిస్తున్న నటుల వివరాలను చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రోహిణి, సుబ్బరాజు, రాజా చేంబోలు నటిస్తున్నారని వెల్లడించిన టీమ్‌ మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలోనే వస్తాయని తెలిపింది.

తమిళంలో విజయం అందుకున్న ‘వినోదాయ సీతాం’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ ఇంకా ఖరారుకాలేదు. #PKSDT అనేది వర్కింగ్‌ టైటిల్‌. ఒకే కుటుంబానికి చెందిన పవన్‌, సాయి తేజ్‌ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు, సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘విరూపాక్ష’ చిత్ర టీజర్‌ను పవన్‌ కల్యాణ్‌ మంగళవారం చూసి, టీమ్‌ను అభినందించారు. కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ మార్చి 1న విడుదలకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు