PM Modi: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ప్రధాని మోదీ ప్రశంస

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌పై ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయులు గర్వపడేలా చేశారని అన్నారు.

Published : 11 Jan 2023 13:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రబృందంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రశంసల వర్షం కురిపించారు. చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ (Golden Globe) అవార్డును ఈ చిత్రం సొంతం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ తాజాగా ప్రధాని ట్వీట్‌ చేశారు. ‘‘ఇదొక విశేషమైన విజయం!! కీరవాణి, ప్రేమ్‌ రక్షిత్‌, కాలభైరవ, చంద్రబోస్‌తోపాటు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, ఇతర చిత్రబృందానికి నా అభినందనలు. ఈ ప్రతిష్ఠాత్మక విజయంతో ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేశారు’’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని