Pongal Movies: పొంగల్ ‘పాంచ్’ పటాకా.. నలుగురు అగ్ర హీరోలు.. మూడు రోజులు!
సంక్రాంతికి సందడి చేసేందుకు తెలుగు సినిమాలతోపాటు డబ్బింగ్ చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ సినిమా ఎలా ఉండబోతుంది? ఏ తేదీన వస్తుందో? చూసేయండి..
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏయే సినిమాలు ఉంటాయి? అనే ఉత్కంఠకు తెరపడింది. నలుగురు అగ్ర హీరోల చిత్రాలు కచ్చితంగా ముగ్గుల పండగకు వస్తాయని అనుకున్నా వాటి విడుదల తేదీ విషయంలో కొంత సందిగ్ధం నెలకొంది. ఇప్పుడు దానిపైనా స్పష్టత వచ్చింది. నాలుగు పెద్ద సినిమాలతోపాటు ఓ చిన్న చిత్రం పొంగల్‌కు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమమైంది. అవే సినిమాలు? ఏ జానర్? ప్రత్యేకతలేంటి? ఓసారి గమనిద్దాం..
తొలుత తమిళ హీరోలు..
థియేటర్లలో సంక్రాంతి సందడి తొలుత తమిళ హీరోలతోనే మొదలుకానుంది. అజిత్ (Ajith Kumar) నటించిన ‘తునివు’ (తెలుగులో తెగింపు)ను పండగకే విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించిన చిత్ర బృందం (Thunivu) ఈ బుధవారం విడుదల తేదీని ఖరారు చేసింది. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. విజయ్ (Vijay) హీరోగా రూపొందిన ‘వారిసు’ (తెలుగులో వారసుడు)ను జనవరి 12న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించిన మూవీ టీమ్ (Varisu) అనూహ్యంగా జనవరి 11ని ఫైనల్ చేసింది.
తెగింపు: అజిత్ హీరోగా దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన చిత్రమిది. బ్యాంకు దోపిడీ కథాంశంతో యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. క్రిమినల్స్- పొలిటిషియన్స్- పోలీస్ ఆఫీసర్స్ చుట్టూ తిరిగే ఈ స్టోరీలో పోరాట సన్నివేశాలకు అధిక ప్రాధాన్యం ఉంది. ఎందుకు హీరో దోపిడీ చేయాల్సి వచ్చింది? వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? ఎవరికైనా సాయం చేసేందుకా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అజిత్- వినోద్ కాంబినేషన్‌లో అంతకుముందు తెరకెక్కిన ‘నేర్కొండపార్వై’, ‘వలిమై’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ‘తెగింపు’పై అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్‌లో వరుసగా మూడు సినిమాలు రూపొందడం విశేషం. మంజూ వారియర్ కథానాయికగా నటించిన ఈ ‘తెగింపు’ ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. న్యూ ఇయర్ కానుకగా విడుదలైన ప్రచార చిత్రం అలరిస్తోంది.
వారసుడు: విజయ్ (Vijay) హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక (Rashmika Mandanna) కథానాయిక. పూర్తిస్థాయి కుటుంబ కథగా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్‌కూ చోటుంది. అన్నదమ్ములు చేసే అల్లరి.. వారి మధ్య ఉండే ఆప్యాయతల కలబోతగా, కుటుంబమే అన్నింటికంటే ముఖ్యం అని గుర్తుచేసే విధంగా ఈ సినిమా ఉండనుంది. ఇందులో విజయ్, టాలీవుడ్ నటుడు శ్రీకాంత్, కిక్ శ్యామ్ సోదరులుగా కనిపిస్తారు. జీవితంలో ప్రతిదాన్నీ తేలికగా తీసుకునే హీరో తన కుటుంబానికి కష్టం వస్తే ఏం చేశాడు? అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది. జాతీయ అవార్డు అందుకున్న ‘మహర్షి’ తర్వాత వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం కావడం, విజయ్ నటించిన తొలి ద్విభాషా (ఏక కాలంలో తెలుగు, తమిళ్‌లో చిత్రీకరించడం) సినిమాకావడంతో ‘వారసుడు’పై అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది.
ఒక్కరోజు తేడాతో బాలయ్య, చిరు
సంక్రాంతి పోరులో చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) ఇప్పటి వరకూ 9 సార్లు పోటీ పడ్డారు. ఇప్పుడు పదోసారి. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) జనవరి 12న, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) జనవరి 13న విడుదలకానున్నాయి. ‘క్రాక్’ వంటి హిట్ తర్వాత గోపీచంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రంకావడం, బ్లాక్ బస్టర్ ‘అఖండ’ తర్వాత బాలయ్య నటించిన సినిమాకావడంతో ‘వీరసింహారెడ్డి’పై అంచనాలు తార స్థాయికి చేరాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలు, పాటలు అభిమానుల్లో జోష్ నింపాయి. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రధారులు.
చిరంజీవి హీరోగా.. ఆయన్ను బాగా అభిమానించే దర్శకుడు కె. బాబీ తెరకెక్కించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. 90ల్లో చిరంజీవి ఎలా కనిపించారో అలాంటి లుక్‌లోనే (వింటేజ్) ఈ సినిమాలోనూ కనిపిస్తారనే విషయం తెలియడమే ఆలస్యం అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరో రవితేజ కీలక పాత్ర పోషించడం ప్రధాన ఆకర్షణ. మత్స్యకారుల నాయకుడిగా చిరు, పోలీసు అధికారిగా రవితేజ నటించారు. కేథరిన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రధారులు.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ఈ రెండింటిలో శ్రుతిహాసనే (Shruti Haasan) కథానాయిక కావడం ఒక విశేషమైతే, రెండింటినీ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం మరో విశేషం. ఒకే హీరోయిన్ నటించిన సినిమాలు ఒకేసారి విడుదలవడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. కానీ, ఒకే నిర్మాణ సంస్థవి రెండు సినిమాలు రోజు వ్యవధిలో, అదీ అతి పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి విడుదలకావడం అరుదు. ఈ రెండు సినిమాల ట్రైలర్లు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి.
పండగకు పెళ్లి సందడి..
ముగ్గుల పండక్కి అగ్ర తారల చిత్రాలు ఎన్ని పోటీ పడినా వాటి మధ్య ఓ చిన్న సినిమా కూడా ఖాయంగా సందడి చేస్తుంటుంది. ఈసారి ఆ జాబితాలో నిలిచింది ‘కల్యాణం కమనీయం’ (Kalyanam Kamaneeyam). సంతోష్ శోభన్ (Santosh Sobhan), ప్రియాభవానీ శంకర్ జంటగా అనిల్ కుమార్ ఆళ్ల తెరకెక్కించిన చిత్రమిది. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ కామెడీ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Kothagudem: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. బాధితుల్లో 15 మంది మైనర్ బాలికలు?
-
Movies News
Rajinikanth: ‘వీర సింహారెడ్డి’ దర్శకుడికి రజనీకాంత్ ఫోన్ కాల్.. ఎందుకంటే?
-
Sports News
Djokovic: అవమానపడ్డ చోటే.. మళ్లీ విజేతగా..
-
World News
H1b Visa: మార్చి 1 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ
-
Ap-top-news News
Tamilisai: బడ్జెట్‌కు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్ తమిళిసై
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు