Ponniyin Selvan: పొన్నియిన్‌ సెల్వన్‌1 లోని ‘అలనై నీకై’ సాంగ్‌ చూశారా..!

అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌1. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న

Published : 20 Sep 2022 12:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ‘అలనై నీకై..’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘జలసఖి నేనై నిలిచా నెలరాజా..’ అంటూ సాగే ఈ పాట యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అనంత శ్రీరామ్‌ ఈ పాటను రాయగా సింగర్‌ అంతరా నందీ అలపించారు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. భారీ తారాగణంతో మణిరత్నం కలల సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యరాయ్‌, త్రిష నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. చోళ రాజ్యం నేపథ్యంలో రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవ్వనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని