Ponniyin Selvan: ఆ ఫార్మాట్‌లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. విజువల్‌ గ్రాండియర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు సరికొత్త

Published : 17 Aug 2022 02:09 IST

హైదరాబాద్‌: విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. విజువల్‌ గ్రాండియర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు మణిరత్నం, ఆయన టీమ్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ను ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. దీంతో ఐమ్యాక్స్‌ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రంగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రికార్డు సృష్టించనుంది. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్‌తోనే తన సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూపించారు మణిరత్నం (Mani Ratnam). విక్రమ్‌(Vikram), కార్తి (Karthi), జయం రవి (jayam ravi), ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai), త్రిష (Trisha) ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని