జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్‌!

మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్ఠాత్మక భారీ బడ్జెట్‌ చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌. 2019 డిసెంబర్‌లో థాయ్‌ల్యాండ్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా షూటింగ్‌ వాయిదా పడింది.

Published : 21 Apr 2021 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్ఠాత్మక భారీ బడ్జెట్‌ చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌. 2019 డిసెంబర్‌లో థాయ్‌ల్యాండ్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా షూటింగ్‌ వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి నుంచి సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లోనూ జరుపుకొంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ తదుపరి షెడ్యూల్‌ని జూన్‌కి వాయిదా వేసినట్లు సమాచారం. కరోనా కేసుల సంఖ్య పెరగడంతోనే ఈ షెడ్యూల్‌ని జూన్‌కి వాయిదా వేస్తున్నట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు జైపుర్, జోధ్పూర్, మధ్యప్రదేశ్‌కి చెందిన రాజభవనాలకు బదులుగా హైదరాబాద్‌లోని సెట్లోనే షూటింగ్‌ చేయడానికి నిర్మాణ సంస్థ ఆలోచిస్తున్నట్లు సమాచారం. జులై - ఆగస్టులో సినిమా షూటింగ్‌ పూర్తయ్యే ముందు చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు సమాచారం. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ  ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా జయరామ్‌, శోభిత ధూళిపాళ్ల, శరత్‌ కుమార్, ప్రకాష్‌రాజ్‌, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటిస్తున్నారు. చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని