Ponniyin Selvan: చాలా జీవిత పాఠాలు నేర్చుకున్నా: కార్తి

మణిరత్నం కలల సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియిన్‌సెల్వన్‌. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. దక్షిణపథాన్ని పరిపాలించిన చోళుల ఇతివృత్తం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Published : 29 Sep 2022 12:31 IST

ఇంటర్నెట్ డెస్క్: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌1’. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. చోళ రాజుల ఇతివృత్తం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు కార్తి ‘వల్లవరాయన్‌ వందిదేవన్‌’ అనే పాత్రలో నటించారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. మణిరత్నం దర్శకత్వంలో పనిచేసిన సమయంలో చాలా జీవితపాఠాలు నేర్చుకున్నట్లు తెలిపారు.

‘‘నేను ఏమి చేయాలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు.  మనం చేసే పనిపై శ్రద్ధ ఉండాలి. మనకు సంతోషాన్ని ఇచ్చే పనులనే ఎంచుకోవాలి. నటించే ప్రతి సినిమా హిట్‌ అవ్వాలన్న నిబంధన లేదు. మన పని మనకు ఆనందాన్నివ్వాలి. మణిరత్నంను ఏదీ అడిగినా ‘నో’ చెప్పరు. తాను చేయాలనుకున్న దాన్ని ఎప్పటికైనా చేసి తీరుతారు. ఈ పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రాన్ని చేయడానికి ఆయన 40 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుల్లో మనం ఏదైనా పని కోసం 6 నెలలు వేచి చూస్తాం. అది అవ్వకపోతే విసుగుతో వదిలేస్తాం. ఆయన అలా కాదు. అనుకొన్నదాన్ని సాధిస్తారు. గొప్ప పనులు ఏవీ సులువుగా పూర్తికావు. ఎక్కువకాలం పోరాడితేనే వస్తాయి. పక్కవాళ్లు మన గురించి ఏమనుకుంటున్నారోనని ఆలోచించకూడదు. మనమేంటో మనకు తెలుసు. దాన్ని నమ్మాలి. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో నేను చాలా జీవితపాఠాలు నేర్చుకున్నాను’’ అని కార్తి అన్నారు. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts