Pooja Hegde: బతుకమ్మ పండగలో భాగమవడం గౌరవంగా భావిస్తున్నా: పూజాహెగ్డే

‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌ (Kisi Ka Bhai Kisi Ki Jaan)’ సినిమాలోని బతుకమ్మ పాటలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్టు ప్రముఖ హీరోయిన్‌ పూజాహెగ్డే తెలిపారు.

Published : 01 Apr 2023 00:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వీయ నిర్మాణంలో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌ (Kisi Ka Bhai Kisi Ki Jaan)’. వెంకటేష్‌, జగపతిబాబు, పూజా హెగ్డే, భూమిక, షెహ్‌నాజ్‌ గిల్‌ కీలక పాత్రలు పోషించారు. ఫర్హాద్‌ సామ్జీ దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా రంజాన్‌ కానుకగా ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆ చిత్రంలోని బతుకమ్మ పాటను విడుదల చేసింది. ఈ సందర్భంగా పూజాహెగ్డే (Pooja Hegde) మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. ఈ పాట ద్వారా ఆ వేడుకలో భాగంకావడం గౌరవంగా భావిస్తున్నా. ఈ పాట.. పూల పండగకు మా చిత్ర బృందం ఇచ్చే ట్రిబ్యూట్‌’’ అని పేర్కొన్నారు. హిందీ సినిమాలో బతుకమ్మ పాటని తెరకెక్కించడం విశేషం.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని