Pooja Hegde: బాడీగార్డ్‌ల మధ్య బుట్టబొమ్మ

బుట్టబొమ్మ..బుట్టబొమ్మ అంటూ తెలుగు ప్రేక్షకులు పదేపదే పాడుకొనేలా తన అందంతో అలరిస్తున్న నాయిక పూజా హెగ్డే. ఆమె దక్షిణాదితో పాటు హిందీలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.

Updated : 14 Oct 2022 07:15 IST

బుట్టబొమ్మ..బుట్టబొమ్మ అంటూ తెలుగు ప్రేక్షకులు పదేపదే పాడుకొనేలా తన అందంతో అలరిస్తున్న నాయిక పూజా హెగ్డే (Pooja Hegde). ఆమె దక్షిణాదితో పాటు హిందీలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం ఆమె సల్మాన్‌ఖాన్‌తో (Salman Khan) కలిసి హిందీలో నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). వెంకటేష్‌ (Venkatesh) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. గురువారం పూజ పుట్టినరోజు. ఈ సినిమా సెట్లోనే ఆమె పుట్టినరోజు వేడుకల్ని వెంకీ, సల్మాన్‌ దగ్గరుండి నిర్వహించి పూజతో కేకు కోయించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోను సల్మాన్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. ‘బాడీ గార్డ్‌’ల మధ్య బుట్టబొమ్మ భలేగా ఉంది’ అంటూ నెటిజన్లు స్పందించారు. హిందీ ‘బాడీగార్డ్‌’లో సల్మాన్‌ తెలుగులో అదే పేరుతో తెరకెక్కిన చిత్రంలో వెంకటేష్‌ నటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని