Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!

ప్రముఖ నటి పూజాహెగ్డే సోదరుడి వివాహం వైభవంగా జరిగింది. వేడుక ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Published : 30 Jan 2023 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి పూజాహెగ్డే (Pooja Hegde) సోదరుడు రిషబ్‌హెగ్డే వివాహం వైభవంగా జరిగింది. శివానీశెట్టి అనే మహిళను ఆయన వివాహమాడారు. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ వేడుక ఫొటోలను పంచుకున్నారు పూజా. ‘‘నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుక ప్రారంభం నుంచి నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నా. చిన్నపిల్లలా నవ్వేశా. ఆనందభాష్పాలు వచ్చాయి’’ అని ఎమోషనల్‌గా పోస్ట్‌ పెట్టారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. సినీ తారలు, నెటిజన్లు, అభిమానులు సైతం విషెస్‌ తెలియజేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు