Pooja Hegde: ‘ఎఫ్‌3’లో పూజా పార్టీ

అందాల రాణి... పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే మరోసారి జిగేల్‌మంటూ ప్రత్యేక పాటతో మురిపించనుంది. ‘ఎఫ్‌3’ సినిమాలో ఆమె పార్టీ గీతంతో సందడి చేయనుంది.

Updated : 16 Apr 2022 08:52 IST

అందాల రాణి... పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే మరోసారి జిగేల్‌మంటూ ప్రత్యేక పాటతో మురిపించనుంది. ‘ఎఫ్‌3’ సినిమాలో ఆమె పార్టీ గీతంతో సందడి చేయనుంది. ఆ పాట చిత్రీకరణని హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో శుక్రవారం నుంచే మొదలు పెట్టినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ‘ఎఫ్‌2’ తర్వాత వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథా నాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌3’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకుడు. మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి తమన్నా, మెహ్రీన్‌, సోనాల్‌ చౌహాన్‌... ఇలా కావల్సినంత గ్లామర్‌ తోడైంది. ఇప్పుడు ప్రత్యేక గీతంతో పూజాహెగ్డే రంగంలోకి దిగడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘‘పార్టీ గీతానికి తగ్గట్టుగానే దేవిశ్రీ  ప్రసాద్‌ హుషారెత్తించే బాణీని సిద్ధం చేశారు. ఈ పాటలో పూజాహెగ్డేతోపాటు, కథా  నాయకులు వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, నాయికలు తమన్నా, మెహ్రీన్‌, సోనాల్‌ సందడి చేస్తారు. పూజా ప్రత్యేక నృత్యం ఈ పాటకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వీళ్లందరినీ కలిపి తెరపై చూడటం ప్రేక్షకులకు నిజంగా పండగలా ఉంటుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని