- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Tollywood: అందాల లాభం.. అభినయం.. రాజపూజ్యం
తెలుగింటి గుమ్మానికి తోరణాన్ని కట్టినంత అందం... మన కథానాయిక. పులుపు, వగరుని జోడించి ఆమె వలపుబాణం విసురుతుంటుంది. కొంచెం తీపి, కొంచెం చేదు అన్నట్టుగా అప్పుడే ప్రేమించి, ఆ వెంటనే అలిగి కథని మలుపు తిప్పుతుంది. అప్పుడప్పుడూ నాటుగా ఘాటుగా కనిపించే ఈ కొంటె భామలంటే కుర్రాళ్లకి ఎంత మమ‘కార’మో! ఉగాది పచ్చడిలాంటి కమ్మనైన పాత్రలెన్నో చేసిన ఈ ముద్దుగుమ్మలంతా తెలుగమ్మాయిల్లాగే మారిపోయారు. పొరుగు భాషల నుంచే వచ్చినా అచ్చమైన తెలుగు భాష మాట్లాడుతూ పాత్రల్ని రక్తి కటిస్తున్నారు. ఉగాది సందర్భంగా వీళ్ల పండగ ముచ్చట్లేమిటో విందాం..
నాకున్న బంధం అలాంటిది
‘‘కొన్ని భాషలు, కొన్ని సంస్కృతులు మనల్ని వెంటనే కలుపుకొని పోయేలా చేస్తాయి. వాటితో అంతకుముందు ఏదో తెలియని అనుబంధం ఉన్న అభిప్రాయాన్ని కలగజేస్తాయి. తెలుగు భాషతో నాకున్న బంధం అలాంటిదే. ఇక్కడ నటించేవరకు నాకు తెలుగు కానీ, ఇక్కడి సంస్కృతిగానీ తెలియదు. నా నట ప్రయాణం మొదలవ్వగానే నేనూ తెలుగమ్మాయినే కదా అనే భావన కలిగింది. ఆ ప్రేమే తెలుగులో సంభాషణలు చెప్పుకొనేలా, తెలుగులో మాట్లాడేలా చేస్తోంది. ఒక నటిగా నాకెంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది తెలుగు భాష, తెలుగు సినిమా. ఈ అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుంది. తెలుగు పండగంటే నాకూ పండగే’’ అని సంబరపడుతోంది పూజాహెగ్డే.
పండగంటే నాకు పిలుపొస్తుంది
కళావతీ... నువ్వు లేకుంటే అదో గతి అంటూ కీర్తి నామ స్మరణ చేస్తోంది తెలుగు కుర్రకారు. తన అందంతో అంతలా మాయ చేస్తోంది మరి. ఇప్పుడామె జాతకం దివ్యంగా ఉందనేది తెలుగు సినీ పండితుల మాట. చిరంజీవి ‘భోళాశంకర్’లోనూ, మహేష్‌తో కలిసి ‘సర్కారు వారి పాట’లోనూ నటిస్తోంది మరి. కొత్తగా ‘దసరా’ కోసం నానితోనూ జోడీ కట్టింది. వీటితోపాటు కొత్తగా మరో సినిమాకీ సంతకం చేసిందని ప్రచారం సాగుతోంది. ‘‘తెలుగు సినిమా నాకెంత ప్రత్యేకమో, అది ఎందుకో అందరికీ తెలుసు. ‘మహానటి’ తర్వాత అనే కాదు, అంతకుముందూ తెలుగు భాష అన్నా, ఇక్కడి సంస్కృతి అన్నా, మనుషులన్నా ఎప్పుడూ కొత్తగా అనిపించింది లేదు. ఇప్పుడైతే నాకు తెలుగులో బోలెడంతమంది స్నేహితులు. ఇక్కడ పండగంటే నాకు పిలుపొస్తుంటుంది. తెలుగు మాట్లాడటాన్ని ఎప్పటికప్పుడు మరింతగా ఆస్వాదిస్తుంటానే తప్ప, ఇబ్బందిగా మాత్రం అనిపించదు’’. అంటోంది కీర్తిసురేష్.
ఇక్కడ అదే ప్రత్యేకత
ఓ పులుపెక్కి పోతున్నవంట కదా అంటూ శ్రీవల్లిగా ముద్దు ముద్దుగా పలికిన రష్మిక మాటల్ని తెలుగు కుర్రాళ్లు ఇప్పట్లో మరిపోలేరు. ఆ మాటలే ఉగాది పచ్చడంత కమ్మగా అనిపించాయి తెలుగు ప్రేక్షకులకు. వరుస అవకాశాలతో జోరు చూపిస్తున్న ఆమె పాత్రతో తెలుగుదనం పలికించడాన్ని ఆస్వాదిస్తానని చెబుతోంది. ‘‘తొలి సినిమాతోనే తెలుగులో సొంతంగా సంభాషణలు చెప్పుకొన్నా. తెలుగు భాషలోనే కాదు, కట్టు బొట్టులోనూ సౌందర్యం, ప్రత్యేకత ఉంటుంది. ఆధునిక పోకడలతో కూడిన పాత్రయినా సరే, తెలుగమ్మాయి అంటే అందులోకి తెలుగుదనాన్ని చొప్పించాలి. అదెలాగో నేను తొలినాళ్లల్లోనే అర్థం చేసుకున్నా’’ అని చెప్పుకొచ్చింది రష్మిక మందన్న.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana News: కేంద్రానికి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతి: హరీశ్‌రావు
-
Technology News
WhatsApp: వాట్సాప్‌లో మెసేజ్ డిలీట్ చేశారా..? ఒక్క క్లిక్‌తో రికవరీ!
-
India News
Bilkis Bano: ఇలాగైతే.. ప్రతి అత్యాచార దోషి విడుదల కోరుకుంటారు!
-
Sports News
Zim vs Ind : స్వల్ప లక్ష్యం.. ఓపెనర్లే ఊదేశారు
-
India News
Jharkhand: జైలులో ఖైదీ హత్య కేసు.. 15మందికి ఉరిశిక్ష
-
Politics News
Telangana News: పార్టీలోనే ఉంటా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మహేశ్వర్‌రెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Thiru review: రివ్యూ: తిరు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Jammu: ఉగ్రవాది అతితెలివి.. ఎన్కౌంటర్ చేసిన పోలీసులు