Pooja Hegde: ప్రేమ వదంతులపై స్పందించే సమయమేది!

వరుస సినిమాలతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక పూజా హెగ్డే (Pooja Hegde). ఆమె ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌తో ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

Updated : 15 Apr 2023 09:21 IST

రుస సినిమాలతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక పూజా హెగ్డే (Pooja Hegde). ఆమె ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌(Salman Khan)తో ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi ka bhai kisi ki jaan) సినిమా చిత్రీకరణ నుంచే వీరు ప్రేమలో ఉన్నారంటూ వదంతులు మొదలయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై పూజ స్పందిస్తూ తను సింగిల్‌ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘దీని గురించి నేను ఏమి చెప్పాలి? రోజూ నా గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి. వాటన్నింటినీ చదువుతూ ఉంటాను. కానీ వాటిని పట్టించుకోను. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. అలా ఉండటమంటేనే నాకు ఇష్టం. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్‌పైనే ఉంది. వేర్వేరు భాషల్లో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. అదే నా లక్ష్యం. ఇలాంటి ప్రేమ వదంతులపై స్పందించే సమయం కూడా నాకు లేదు’’ అని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని