Published : 28 Apr 2022 17:46 IST

Pooja Hegde: ’ స్క్రిప్ట్‌ చెప్పినప్పుడే.. ఇందులో తప్పకుండా భాగం కావాలని నిర్ణయించుకున్నా..

హైదరాబాద్‌: ‘ధర్మస్థలి’... చిరంజీవి, రామ్‌చరణ్‌ల ‘ఆచార్య’లో ఎక్కువగా వినిపించే ప్రాంతం పేరు. చుట్టూ పచ్చటి వాతావరణం, పక్కనే నదీ ప్రవాహం మధ్యలో సుందరమైన గ్రామం అందులో కొలువైన అమ్మవారు.. ఇదీ ఇప్పటివరకూ ‘ధర్మస్థలి’ గురించి తెలిసిన విశేషాలు. ఇలాంటి గ్రామీణ, ఆధ్మాత్మిక  వాతావరణం కలిగి ఉన్న సెట్‌లో వర్క్ చేయడం, చిరు, చరణ్‌లతో స్క్రీన్‌ పంచుకోవడంపై తాజాగా నటి పూజా హెగ్డే స్పందించారు. ‘ధర్మస్థలి’ తనకెంతగానో నచ్చేసిందని అన్నారు. శుక్రవారం ‘ఆచార్య’ విడుదల కానున్న నేపథ్యంలో పూజాహెగ్డే తాజాగా తన అనుభవాలు పంచుకున్నారు.

‘‘కొరటాల శివ నాకు ‘ఆచార్య’ స్క్రిప్ట్‌ చెప్పినప్పుడే.. ఇదొక అందమైన చిత్రమని, ఇందులో తప్పకుండా భాగం కావాలని నిర్ణయించుకున్నా. నీలాంబరి పాత్ర ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నది. ఇప్పటివరకూ చూడని విధంగా మరింత విభిన్నంగా నన్ను చూస్తారు. చరణ్‌తో కలిసి వర్క్‌ చేయడం ఎంతో సరదాగా సాగింది. నాకు తెలిసినంతవరకూ నటీనటులందరూ చిరంజీవి సర్‌తో తప్పకుండా స్క్రీన్‌ పంచుకోవాలనుకుంటారు. అలాంటి మెగాస్టార్‌ పక్కన నాకు నటించే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నా. ఆయన స్టైల్‌ నాకు బాగా నచ్చేసింది. కొరటాల దర్శకుడు మాత్రమే కాదు మంచి రచయిత కూడా. అన్నింటి కంటే ముఖ్యంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ ‘ధర్మస్థలి’ సెట్‌ని ఎంతో అద్భుతంగా సృష్టించారు. ఆలయంలోని కాళీ మాతను చూసిన ప్రతిసారీ భక్తిభావంలో మునిగిపోయేదాణ్ణి’’ అని పూజా వివరించారు. కోకాపేటలోని చిరంజీవికి చెందిన స్థలంలోనే ‘ధర్మస్థలి’ సెట్‌ క్రియేట్‌ చేశారు. సుమారు 20 ఎకరాల్లో ఈ ప్రాంతాన్ని నిర్మించారు.Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts