Pooja Hegde: పూజ డిష్యూం డిష్యూం

బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇప్పటివరకు అందచందాలతో ఆకట్టుకోవడమే చూశాం. త్వరలోనే ఆమె తనలోని యాక్షన్‌ కోణాన్ని చూపించనుంది. డిష్యూం డిష్యూం అంటూ పోరాట ఘట్టాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది.

Updated : 01 Jun 2022 13:47 IST

బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇప్పటివరకు అందచందాలతో ఆకట్టుకోవడమే చూశాం. త్వరలోనే ఆమె తనలోని యాక్షన్‌ కోణాన్ని చూపించనుంది. డిష్యూం డిష్యూం అంటూ పోరాట ఘట్టాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జనగణమన’లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపికైంది. విజయ్‌ దేవరకొండకి జోడీగా కనిపించనుంది. ఇందులో పూజాహెగ్డే యాక్షన్‌ ప్రధానమైన పాత్రలో సందడి చేయనుంది. ఆ పాత్ర కోసం ఆమె థాయ్‌లాండ్‌ నుంచి వచ్చిన ఓ బృందం నేతృత్వంలో యుద్ధకళల్లో శిక్షణ తీసుకోనుంది. ఇది పూర్తయిన వెంటనే ముంబయిలోనే ఆరంభం కానున్న ‘జనగణమన’ చిత్రీకరణలో పాల్గొంటుంది పూజా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని