ప్రియుడ్ని పరిచయం చేసిన ‘పరుగు’ నటి

నటి పూనమ్ బజ్వా తన ప్రియుడు, సోల్‌మేట్‌ సునీల్‌ రెడ్డిని పరిచయం చేశారు. ‘మొదటి సినిమా’ (2005)తో కెరీర్‌ ఆరంభించి.. ‘బాస్‌’, ‘పరుగు’ తదితర చిత్రాలతో తెలుగులో గుర్తింపు పొందిన ఆమె బుధవారం ఫాలోవర్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. తను ప్రేమలో ఉన్నట్లు వెల్లడిస్తూ.. ప్రియుడికి ప్రత్యేకంగా.....

Updated : 29 Oct 2020 15:00 IST

‘నీపై ప్రేమను మాటల్లో చెప్పలేను..’

హైదరాబాద్‌: నటి పూనమ్ బజ్వా తన ప్రియుడు, సోల్‌మేట్‌ సునీల్‌ రెడ్డిని పరిచయం చేశారు. ‘మొదటి సినిమా’ (2005)తో కెరీర్‌ ఆరంభించి.. ‘బాస్‌’, ‘పరుగు’ తదితర చిత్రాలతో తెలుగులో గుర్తింపు పొందిన ఆమె బుధవారం ఫాలోవర్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. తను ప్రేమలో ఉన్నట్లు వెల్లడిస్తూ.. ప్రియుడికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటోల్ని షేర్‌ చేశారు.

‘సునీల్‌ రెడ్డి.. మై రూట్స్‌, గ్రౌండ్‌, వింగ్స్‌. హ్యాండ్సమ్‌, అందమైన హృదయం ఉన్న నా లైఫ్‌ మేట్‌, సోల్‌ మేట్‌కు హ్యాపీ బర్త్‌డే. నీతో కలిసి ఉండే ప్రతి మూమెంట్‌ ఓ మ్యాజిక్‌లా ఉంటుంది. నీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ప్రేమ, ఫన్‌ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. మాటల్లో వర్ణించలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అని పూనమ్‌ ఆయనపై ఇష్టాన్ని తన స్టైల్‌లో చెప్పారు. ఆమె పోస్ట్‌కు ఫాలోవర్స్‌తోపాటు సినీ ప్రముఖులు సందీప్‌ కిషన్‌, కామ్నా జఠ్మలానీ, ఆర్తి చబ్రియా తదితరులు స్పందించారు. నటికి శుభాకాంక్షలు చెప్పారు.

పూనమ్‌ టాలీవుడ్‌ కంటే మాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఎక్కువ చిత్రాల్లో నటించారు. గత ఏడాది నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తీసిన ‘యన్‌.టి.ఆర్‌: కథానాయకుడు’లో అతిథిగా మెరిశారు. ఆపై ‘కుప్పతు రాజా’ అనే తమిళ సినిమాలో సందడి చేశారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఇందులో కథానాయకుడిగా నటించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని