Poonam Kaur: నేనూ తెలంగాణ బిడ్డనే.. సినీనటి పూనమ్‌ కౌర్‌ భావోద్వేగం

సినీ పరిశ్రమలో తనని పంజాబీ అమ్మాయినని వెలివేస్తున్నారని సినీనటి పూనమ్‌కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 07 Mar 2023 10:11 IST

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలో తనని పంజాబీ అమ్మాయినని వెలివేస్తున్నారని సినీనటి పూనమ్‌ కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వేదికపై పూనమ్‌కౌర్‌ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తాను తెలంగాణాలో పుట్టిన బిడ్డనని.. ఇక్కడే పెరిగానంటూ కంటతడి పెట్టుకున్నారు.  ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసైతో పాటు జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ, ఐఏఎస్‌ అధికారిణి శైలజా రామయ్యర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని