posani krishna murali: పోసానికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి
సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. తాజా ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇతర నియమ, నిబంధనలు, అపాయింట్‌మెంట్ వివరాలు ప్రత్యేకంగా వెల్లడించనున్నట్లు ప్రకటించింది. రచయితగా చిత్ర పరిశ్రమలో కెరీర్‌ను మొదలు పెట్టిన పోసాని, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రచయితగా కంటే కూడా నటుడిగా ఎక్కువ సినిమాల్లో మెప్పించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలుపుతూ వచ్చారు. గత ఎన్నికల్లోనూ వైకాపా తరపున ప్రచారం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/03/2023)
-
Movies News
Dil Raju: ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు దిల్‌రాజు కానుకలు
-
India News
IAF chief: అంతరిక్షంపై భారత్ పట్టు సాధించాలి: వాయుసేన చీఫ్
-
Movies News
Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్ ఇచ్చి
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!