F3: వేసవిలో వెంకీ వినోదం

సమ్మర్‌ సోగ్గాళ్లుగా తెరపై సందడి చేయనున్నారు వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌. ఆ ఇద్దరూ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌3’.విజయవంతమైన ‘ఎఫ్‌2’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది.

Updated : 10 Apr 2022 13:48 IST

మ్మర్‌ సోగ్గాళ్లుగా తెరపై సందడి చేయనున్నారు వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌. ఆ ఇద్దరూ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌3’.విజయవంతమైన ‘ఎఫ్‌2’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది. తమన్నా భాటియా, మెహ్రీన్‌ పిర్జాదా కథానాయికలు. సోనాల్‌ చౌహాన్‌, రాజేంద్రప్రసాద్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డబ్బు చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: తమ్మిరాజు, సహనిర్మాత: హర్షిత్‌రెడ్డి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని