HariHara Veera Mallu: తొడకొట్టాడో తెలుగోడు.. పవర్‌గ్లాన్స్‌ చూస్తే గూస్‌బంప్స్‌ పక్కా..!

పవర్‌స్టార్‌ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఆయన హీరోగా నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ (HariHara Veera Mallu) నుంచి...

Updated : 02 Sep 2022 10:44 IST

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఆయన హీరోగా నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ (HariHara Veera Mallu) నుంచి పవర్‌గ్లాన్స్‌ విడుదలైంది. శుక్రవారం పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని చిత్రబృందం ఈ వీడియో షేర్‌ చేసింది. ‘‘మెడల్ని వంచి, కథల్ని మార్చి, కొలిక్కి తెచ్చే పనెట్టుకొని.. తొడకొట్టాడో తెలుగోడు’’ అంటూ సాగే పాటతో విడుదలైన ఈ వీడియోలో పవన్‌ లుక్‌, మేనరిజం పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. మల్లయోధులతో ఆయన పోరాటం చేస్తున్న దృశ్యాలకు తగ్గట్టుగా ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరుతో సాగే ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.

హిస్టారికల్‌ చిత్రంగా ‘హరి హర వీరమల్లు’ సిద్ధమవుతోంది. మొఘలాయిలు, కుతుబ్‌ షాహీల శకం నేపథ్యంలో సాగే కథ ఇది. చరిత్రకెక్కిన ఒక బందిపోటు వీరోచిత గాథగా దీన్ని రూపొందిస్తున్నారు. క్రిష్‌ దర్శకుడు. పాన్‌ ఇండియా స్థాయిలో దీన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే సగం సినిమా షూట్‌ పూర్తైంది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. నిధి అగర్వాల్‌ కథానాయిక. దయాకర్‌రావు నిర్మాత. ఎ.ఎం.రత్నం సమర్పకులు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని