Adipurush: మహిమాన్విత మంత్రం నీ నామం

‘‘ఎవరు ఎదురు రాగలరు మీ దారికి. ఎవరికి ఉంది ఆ అధికారం. పర్వత పాదాలు వణికి కదులుతాయ్‌.. మీ హుంకారానికి!’’ అంటూ లంకేశుడిపై యుద్ధానికి వానర సైన్యాన్ని రాఘవుడు చైతన్య పరుస్తుంటే ‘‘నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వసైన్యం.

Updated : 21 May 2023 06:49 IST

‘‘ఎవరు ఎదురు రాగలరు మీ దారికి. ఎవరికి ఉంది ఆ అధికారం. పర్వత పాదాలు వణికి కదులుతాయ్‌.. మీ హుంకారానికి!’’ అంటూ లంకేశుడిపై యుద్ధానికి వానర సైన్యాన్ని రాఘవుడు చైతన్య పరుస్తుంటే ‘‘నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వసైన్యం. సహచరులై పదా వస్తున్నాం.. సఫలం స్వామి కార్యం....మహిమాన్విత మంత్రం నీ నామం’’ అంటూ రామ నామాన్ని జపిస్తూ ఉత్సాహంగా కదన రంగంలోకి దూకుతోంది వానర సేన. మరి ఈ రామ - రావణ యుద్ధం ఎలా సాగిందో తెలియాలంటే ‘ఆదిపురుష్‌’ (Adipurush) చూడాల్సిందే. ప్రభాస్‌ (Prabhas) టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రమిది. రామాయణం ఆధారంగా ఓం రౌత్‌ తెరకెక్కించారు. ఇందులో జానకిగా కృతిసనన్‌ నటించగా.. లంకేశుడి పాత్రను సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించారు. ఈ సినిమా జూన్‌ 16న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని ‘‘జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌.. రాజా రామ్‌’’ అనే గీతాన్ని శనివారం విడుదల చేశారు. ఈ పాటకు అజయ్‌ - అతుల్‌ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. పాటలో రాఘవుడిగా ప్రభాస్‌ కనిపించిన తీరు.. వానర దండుతో కలిసి ఆయన యుద్ధానికి బయలుదేరిన విధానం ఆసక్తికరంగా చూపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని