Adipurush: ‘ఆదిపురుష్’ సంక్రాంతి బరిలో నుంచి వైదొలగనుందా..?
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రభాస్ సినిమా ‘ఆదిపురుష్’. పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్: ప్రభాస్ (Prabhas) రాముడి పాత్రలో ఓం రౌత్ (Om Raut) రూపొందిస్తున్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ (Adipurush). కృతిసనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ లంకేష్‌గా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా అందించనున్నామని గతంలో మేకర్స్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిల్మినగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా వాయిదా పడునుందని సంక్రాంతికి కాకుండా వేసవిలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని టాక్.
మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, వాయిదా పడటం దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై కొంతమందిని నిరాశపరిచింది. దీంతో, గ్రాఫిక్స్ వర్క్‌పై ఓం రౌత్ మరింత కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీపడితే సినిమా అంచనాలు దెబ్బతింటాయని అందుకే గ్రాఫిక్స్ విషయంలో దర్శక, నిర్మాతలు ఎక్కువ కృషి చేస్తున్నారట. ఈ సినిమా వాయిదా వెనక ఇది కూడా ఓ కారణమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వాయిదా విషయంపై చిత్రబృందం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Transcouple: ట్రాన్స్జెండర్లు.. తల్లిదండ్రులైన జంట
-
Politics News
Rahul Gandhi: నా ప్రశ్నలకు ప్రధాని నుంచి సమాధానం రాలేదు: రాహుల్
-
General News
TSLPRB: దేహదారుఢ్య పరీక్షల్లో అనర్హులైన ఆ అభ్యర్థులకు మళ్లీ అవకాశం
-
Crime News
Gurugram: ‘నేనేం తప్పు చేశాను.. నాకెందుకు ఈ శిక్ష’... 14 ఏళ్ల బాలికపై దంపతుల పైశాచిక దాడి!
-
Politics News
MLC Kavitha: జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని మోదీ: ఎమ్మెల్సీ కవిత
-
Sports News
IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్.. ‘100’ క్లబ్లో పుజారా