Prabhas: 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ రాక.. మొగల్తూరులో అభిమానుల హంగామా

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు (Krishnam Raju) సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.....

Updated : 29 Sep 2022 11:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు (Krishnam Raju) సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్‌ (Prabhas) ఇక్కడకు చేరుకున్నారు. దశాబ్దకాలం తర్వాత తమ అభిమాన హీరో ఇక్కడికి రావడంతో ఈ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.

ప్రభాస్‌ ఇంటి వద్దకు భారీగా చేరుకొన్న అభిమానులు ‘రెబల్‌స్టార్‌.. రెబల్‌స్టార్‌’ అంటూ నినాదాలు చేశారు. పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక మధ్యాహ్నం జరగనున్న కార్యక్రమంలో సుమారు లక్షమంది అభిమానుల కోసం ప్రభాస్‌ టీమ్‌ భోజన ఏర్పాట్లు చేసింది.  2010లో  తన తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన సమయంలో సంతాప కార్యక్రమాల కోసం ప్రభాస్‌ మొగల్తూరులో వారం రోజులు పాటు ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి ఆయన ఇప్పుడే వచ్చారు.









Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని