Prabhas: ప్రభాస్‌ మొహమాటం.. రాజమౌళికి తిట్లు..

‘బాహుబలి’తో పాన్‌ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నారు ప్రభాస్‌ (Prabhas). ఆ ఒక్క సినిమా ఆయన స్టార్‌డమ్‌ను అమాంతం పెంచేసింది.

Published : 07 Apr 2023 11:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘బాహుబలి’తో పాన్‌ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నారు ప్రభాస్‌ (Prabhas). ఆ ఒక్క సినిమా ఆయన స్టార్‌డమ్‌ను అమాంతం పెంచేసింది. అంత పెద్ద సినిమాను చేసినా, జనం ముందు ఓపెన్‌గా మాట్లాడాలంటే ప్రభాస్‌కు చాలా మొహమాటం. ప్రీరిలీజ్‌ వేడుకల్లోనూ ఆయన ఎక్కువసేపు మాట్లాడరు. సెట్‌లో కూడా ఎక్కువమంది ఆర్టిస్ట్‌లు, జనం ఉంటే గట్టిగా డైలాగ్‌ చెప్పడానికి ఇబ్బంది పడిపోతారట. ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ (chatrapathi ) సినిమా సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

సినిమా ఇంటర్వెల్‌ చిత్రీకరణ సందర్భంగా విలన్‌ను చంపిన తర్వాత, కోట శ్రీనివాసరావుకు వార్నింగ్‌ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత జనాన్ని ఉద్దేశిస్తూ ప్రభాస్‌ డైలాగ్‌ చెప్పాలి. ఒకవైపు వర్షం, మరొకవైపు చలితో ఇబ్బంది పడుతున్న ఆయన జనం కనిపించే సరికి డైలాగ్‌ చెప్పలేకపోయారు. అక్కడే ఉన్న రాజమౌళిని పిలిచి ‘జక్కన్న నేను డైలాగ్‌ గట్టిగా చెప్పలేను. సైలెంట్‌గా చెబుతా. ప్లీజ్‌..’ అన్నారట. రాజమౌళి కూడా ఒప్పుకోవడంతో హైపిచ్‌లో డైలాగ్‌ చెప్పాల్సిన ప్రభాస్‌.. చిన్నగా చెబుతూ షాట్‌ పూర్తి చేశారట. రాజమౌళి ‘షాట్‌ ఓకే’ అనగానే అప్పటి వరకూ రిహార్సల్స్‌ అనుకున్న వారందరూ ఆశ్చర్యపోయారట.

ఇలాగే ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ షూటింగ్‌ సమయంలోనూ ప్రభాస్‌ పెద్దగా డైలాగ్‌ చెప్పడానికి ఇబ్బందిపడ్డారట. అక్కడే ఉన్న లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్ పిలిచి, ‘ఇలాగైతే ఎలాగయ్యా.. ఓపెన్‌గా డైలాగ్‌ చెప్పాలి. సిగ్గు పడితే ఎలా’ అన్నారట. ఆయన ముందు ‘సరే సర్‌’ అన్నా కూడా ఆ తర్వాత ప్రభాస్‌కు మొహమాటం అడ్డం వచ్చేదట. అప్పటి నుంచి ప్రభాస్‌తో పనిచేసే దర్శకులందరూ రాజమౌళిని తిట్టుకోవడం మొదలుపెట్టారట. ‘రాజమౌళి అలవాటు చేయడం వల్లే నువ్వు డైలాగ్‌లు నెమ్మదిగా చెబుతున్నావు’ అనేవారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్‌ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని