Prabhas: ఏమీ లేకపోయినా అనవసరంగా గోల చేస్తున్నారు: ప్రభాస్‌

బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్‌ షోలో పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ సందడి చేశారు. తన కెరీర్ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Updated : 30 Dec 2022 17:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆదిపురుష్‌’ కోస్టార్‌ కృతిసనన్‌తో (Kriti Sanon) తాను ప్రేమలో ఉన్నట్లు వస్తోన్న వార్తలపై ప్రభాస్‌ (Prabhas) స్పందించారు. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని అన్నారు. ‘‘నువ్వు ఎంతోమంది హీరోయిన్స్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నావు. కానీ, రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు?’’ అని అన్‌స్టాపబుల్‌ (Unstoppable) షోలో బాలయ్య ప్రశ్నించగా.. ‘‘అది పాత వార్త‌‌. అవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమేనని మేడమ్‌(కృతిసనన్‌) ఇప్పటికే చెప్పేసింది కదా. ఆ వార్తల్లో నిజం లేదు. మీకు తెలియంది ఏముంది? ఏమీ లేకపోయినా అనవసరంగా ఇలాంటి గోల చేస్తున్నారు’’ అని ప్రభాస్‌ స్పష్టత ఇచ్చారు.

తాను నటించిన పలు చిత్రాల గురించి ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో మొదటి విజయాన్ని అందించిన చిత్రం ‘వర్షం’. ఆ సినిమా చేస్తున్నప్పుడే అది హిట్‌ అవుతుందని టీమ్‌ మొత్తం విశ్వసించాం. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌‌’ షూట్‌ ఆరు నెలల్లోనే అయిపోయింది. అయితే క్లైమాక్స్‌లో ఎమోషన్స్‌ సరిగ్గా రాలేదనే ఉద్దేశంతో మరో మూడు నెలలపాటు రీషూట్‌ చేశాం. నిర్మాత దిల్‌రాజు అందుకు ఓకే అన్నారు. అలా, సినిమా కాస్త వాయిదా పడింది. ‘ఛత్రపతి’ చేస్తున్నప్పుడు షూట్‌ మొదలైన నాలుగు రోజులకే రాజమౌళి గొప్ప మనిషి అని అర్థమైంది. ఆయన మంచి ఫ్రెండ్ అయ్యారు. ఆ సినిమా విరామ సన్నివేశాలు షూట్‌ చేసేటప్పుడు సెట్‌ మొత్తం జనాలు. వాళ్లందర్నీ చూసి డైలాగ్‌ చెప్పడానికి సిగ్గుగా అనిపించింది. అదే విషయాన్ని జక్కన్నతో చెప్పి ఈ సీన్‌ వరకూ మూకీగా యాక్ట్‌ చేశాను. అక్కడ ఉన్న వాళ్లందరూ రిహార్సల్స్‌ అనుకున్నారు. ‘బాహుబలి’ లాంటి సినిమాలో నటించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు.’’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు