
Updated : 07 Dec 2021 22:30 IST
Prabhas: ఏపీ వరదలు.. సీఎం సహాయ నిధికి ప్రభాస్ విరాళం ఎంతంటే..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చిన వరదల కారణంగా పలు జిల్లాల్లో తీవ్ర నష్టం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. కాగా.. వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. తాజాగా ప్రభాస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళంగా అందజేశారు.
అంతకుముందు వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు చిరంజీవి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్ రూ.25లక్షలు చొప్పున సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. వారంతా వరద బాధిత జిల్లాలు త్వరితగతిన సాధారణ స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
Tags :