SALAAR: సలార్‌.. నో చెప్పిన స్టార్‌ని ఒప్పించిన ప్రభాస్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌నీల్‌ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారని ఇటీవల...

Published : 05 Apr 2022 02:07 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తోన్న పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌నీల్‌ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారని ఇటీవల ప్రభాస్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో పృథ్వీరాజ్‌ పాత్ర ఎంతో కీలకంగా ఉండనుందట. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మలయాళీ పోర్టల్‌కు పృథ్వీరాజ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘సలార్‌’ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనుకోని కారణాల వల్ల తాను ‘సలార్‌’ నుంచి తప్పుకొన్నానని.. ప్రభాస్‌ వల్లే తిరిగి చిత్రంలో భాగమయ్యానని అన్నారు.

‘‘ప్రశాంత్‌నీల్‌, హోంబలే ఫిల్మ్స్‌ సంస్థతో నాకు మంచి అనుబంధం ఉంది. ‘సలార్‌’ పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నప్పుడు గతేడాది ప్రశాంత్‌నీల్‌ నన్ను కలిశారు. ‘సలార్‌’లో ఓ కీలక పాత్ర ఉందని, చేయాలని కోరారు. కథ విన్నాను. ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. దాంతో సినిమా చేస్తానని చెప్పాను. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్‌ వాయిదా పడటం, అదే సమయంలో నా కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడంతో డేట్స్‌ సర్దుబాటు కాక సలార్‌’ చేయలేనని ప్రశాంత్‌తో చెప్పేశాను. ఆ తర్వాత ప్రభాస్‌, ప్రశాంత్‌ నన్ను కలిశారు. సినిమా చేయాలని కోరారు. నా ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే ఆ సినిమాలో భాగమవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా, నేను మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను’’ అని పృథ్వీరాజ్‌ చెప్పుకొచ్చారు. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తోన్న ఈసినిమాలో శ్రుతిహాసన్‌ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని