ప్రభాస్‌ ‘కల్కి’ రిలీజ్‌.. ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద ఫ్యాన్స్‌ సందడి

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రిలీజ్‌ సందర్భంగా ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద సందడి నెలకొంది.

Updated : 27 Jun 2024 12:09 IST

హైదరాబాద్‌: రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద సందడి నెలకొంది. సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సినిమాలో ఉపయోగించిన ‘బుజ్జి’ (వాహనం)ని అక్కడ ప్రదర్శనకు ఉంచారు. దాని వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఫ్యాన్స్‌ పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో ఐమాక్స్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని