salaar teaser: ప్రభాస్‌ ‘సలార్‌’ టీజర్‌ కోసం వెయిటింగ్‌.. ఈ మీమ్స్‌ చూస్తే నవ్వులే నవ్వులు!

salaar teaser: ప్రభాస్‌ కీలక పాత్రలో నటిస్తున్న ‘సలార్‌’ టీజర్‌ గురువారం విడుదల కానున్న నేపథ్యంలో మీమ్స్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated : 05 Jul 2023 10:11 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (prabhas) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’ (salaar teaser). శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 5.12గంటలకు టీజర్‌ విడుదల కానుంది. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, ఈ టీజర్‌పై తమకున్న ఆసక్తిని మీమ్స్‌ రూపంలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతకుమించి నవ్వులు పంచుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని