Billa: ‘బిల్లా’ రీ రిలీజ్.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి
టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్‌కల్యాణ్, బాలకృష్ణ, మహేశ్‌బాబు నటించిన చిత్రాలు రీ రిలీజ్ కాగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రభాస్ నటించిన ‘బిల్లా’ చేరింది. ప్రభాస్ బర్త్‌డేని పురస్కరించుకుని ‘బిల్లా’ 4కే వెర్షన్‌ను చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.
హైదరాబాద్: ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బిల్లా’ (BILLA). అనుష్క, నమిత, హన్సిక కథానాయికలు. మెహర్ రమేశ్ దర్శకుడు. 2009లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మంచి టాక్ అందుకుంది. ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని చిత్రబృందం తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేసింది. దీంతో ఆదివారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో వద్ద రెబల్ ఫ్యాన్స్ సందడి చేశారు. తమ అభిమాన హీరో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేశారు. టపాసులు కాల్చి తీన్‌మార్ డప్పులతో డ్యాన్స్‌లు చేశారు. థియేటర్ లోపల కూడా ఇదే రకమైన సందడి వాతావరణం నెలకొంది. స్క్రీన్‌పై ప్రభాస్ కనపడగానే పేపర్లు విసురుతూ.. ఈలలు వేశారు. ఆయా వీడియోలు ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక చిత్ర దర్శకుడు మెహర్ రమేశ్, ప్రభాస్ సోదరి ప్రసీదా సైతం దేవి థియేటర్ వద్ద సందడి చేశారు. అభిమానులతో కలిసి వారు ‘బిల్లా’ చిత్రాన్ని వీక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్