Published : 03 Jun 2021 09:50 IST

Prabhas: ఆ స‌న్నివేశం చేసేప్పుడు చాలా ఇబ్బంది ప‌డ్డా

ఇంటర్నెట్ డెస్క్‌: ‘ఆ సీన్‌లో న‌టించేందుకు కాస్త ఇబ్బందిగా అనిపించింది.. క‌థ డిమాండ్ మేర‌కు న‌టించాల్సి వ‌చ్చింది’ అనే మాట‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తూనే ఉంటాయి. అగ్ర క‌థానాయ‌కుడు ప్ర‌భాస్‌కు ఇలాంటి సంఘ‌ట‌నే ఎదురైంది. ఓ ఇంట‌ర్వ్యూలో.. మీరు ఏ స‌న్నివేశం కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డారు? అనే ప్ర‌శ్నకి ప్ర‌భాస్ ఇలా స‌మాధానం ఇచ్చారు.

‘‘చ‌క్రం’లోని ఓ సీన్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డా. సినిమాల్లోకి రాక‌ముందు నాకు ‘గే’ సంస్కృతి గురించి అసలు తెలియదు. క‌థానాయ‌కులు అమ్మాయిల్లా నటించ‌డమూ నాకు న‌చ్చేది కాదు. కానీ, ‘చ‌క్రం’లో అలాంటి స‌న్నివేశం ఒక‌టి చేయాల్సి వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ గురించి తెలిసిందే క‌దా. ఆయ‌న చాలా కచ్చితంగా వ్యవహరిస్తారు. దాంతో చేయ‌క త‌ప్ప‌లేదు. ఆ స‌న్నివేశంలో న‌టించేట‌ప్పుడు చెమ‌ట్లొచ్చేసేవి’’ అని తెలిపారు.

ప్ర‌స్తుతం ప‌లు పాన్ ఇండియా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు ప్ర‌భాస్‌.  ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆది పురుష్‌’, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ‘స‌లార్’ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా ఖ‌రారు చేశారు. రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన ‘రాధే శ్యామ్’ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts