Unstoppable2: అటు బాలకృష్ణ.. ఇటు ప్రభాస్‌.. ప్రత్యేక వీడియో చూశారా?

అన్‌స్టాపబుల్‌ కార్యక్రమానికి ప్రభాస్ రానున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ఆహా ప్రత్యేక వీడియో రిలీజ్‌ చేసింది.

Updated : 11 Dec 2022 14:54 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ(Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో అన్‌స్టాపబుల్‌2(Unstoppable2). ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా సీజన్‌2 స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యంగ్‌ హీరోలు, టాలీవుడ్‌ ప్రముఖులు, పలువురు పొలిటీషియన్స్‌ ఈ షోలో సందడి చేశారు. అయితే కొన్నిరోజుల నుంచి ఈ బ్లాక్‌బాస్టర్‌ షోకి స్టార్‌ హీరో ప్రభాస్‌(Prabhas) రానున్నారనే వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ఆహా ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది.

ప్రభాస్‌, బాలకృష్ణ ఒకే స్టైల్‌లో చేసిన సన్నివేశాలను ఎడిట్‌ చేస్తూ ఉన్న వీడియో పోస్ట్‌ చేసిన ఆహా.. ‘‘బాహుబలి ఎపిసోడ్‌ త్వరలో మీ ముందుకు రానుంది. రెడీగా ఉండండి’’ అని ట్వీట్‌ చేసింది.ఈ వీడియో చూసిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత వారి అభిమాన కథానాయకుడు తెరపై కనిపిస్తాడన్న ఆనందంతో ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. బాలకృష్ణ మాస్‌ ప్రశ్నలకు ప్రభాస్‌ చెప్పే క్రేజీ సమాధానాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని