Kalki: రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా.. తొలి ఇండియన్ సినిమాగా రికార్డు

‘కల్కి’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా రెండు మిలియన్ల మార్క్‌ను అందుకున్న తొలి ఇండియన్‌ చిత్రంగా నిలిచింది.

Updated : 19 Jun 2024 13:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ హీరోగా నాగ్‌అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.  విడుదల నేపథ్యంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ చిత్రం రికార్డులను సొంతం చేసుకొంటోంది. ప్రీ బుకింగ్స్‌లో హవా చూపిస్తోంది.

ఓవర్సీస్‌లో కల్కి ప్రీ బుకింగ్స్‌ ఇటీవల ఓపెన్‌ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల్లోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులను బ్రేక్ చేస్తూ మిలియన్‌ డాలర్ల ప్రీ సేల్‌ బిజినెస్‌ జరిగింది. ఇప్పుడు ఆ సేల్‌ రెండు మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. కేవలం నార్త్‌ అమెరికాలోనే 2 మిలియన్‌ డాలర్ల బిజినెస్‌ జరగడం విశేషం. విడుదలకు ముందే అత్యంత వేగంగా ఈ స్థాయిలో సేల్‌ జరిగిన తొలి భారతీయ సినిమాగా ‘కల్కి’ నిలిచింది. రిలీజ్‌కు ఇంకా 9 రోజుల సమయం ఉండడంతో ఇవి ఇంకా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 5000 టికెట్లు అమ్ముడయ్యాయని మూవీ యూనిట్‌ తెలిపింది.

వాటిని నమ్మొద్దు.. జాన్వీ సోషల్‌ మీడియా ఖాతాలపై టీమ్‌ క్లారిటీ

మరోవైపు ‘కల్కి’ ప్రమోషన్స్‌ జోరు పెంచారు. ‘వరల్డ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో వీడియోస్‌ విడుదల చేయనున్నారు. ఎపిసోడ్‌లుగా వీటిిని అందించనున్నారు. ‘ఈ కథ అన్నిటికీ క్లైమాక్స్‌. బెస్ట్‌ అందించనున్నాం’ అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెలిపారు. ఈ చిత్రంలో కీలకమైన బుజ్జి (వాహనం) ఇప్పటికే పలు నగరాల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఇది దిల్లీ వీధుల్లో తిరిగేందుకు సిద్ధమైంది. అలాగే ప్రచారంలో భాగంగా ‘భైరవ ఆంథమ్‌’ను (Prabhas) విడుదల చేయగా అది 5 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని