Kalki: ప్రభాస్‌ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్‌ బచ్చన్

తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్‌ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే..

Updated : 24 Jun 2024 14:31 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఇందులో నటించిన అగ్ర నటీనటులు ఇంటర్వ్యూలో పాల్గొని వారి అనుభవాలను పంచుకున్నారు.

‘కల్కి’ ఐడియా చెప్పగానే మీకు ఏమనిపించింది?

స్వప్నదత్‌: దీనికోసం నాగ్‌అశ్విన్‌ కొన్ని సంవత్సరాలుగా కష్టపడ్డారు. ‘మహానటి’ పూర్తయ్యాక.. నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి’ గురించి ఒక్కలైన్‌ చెప్పారు. అద్భుతమనిపించింది. చాలా రీసెర్చ్‌ చేసి దీన్ని ప్రారంభించారు. చిత్రీకరణ సమయంలో ఆయన విజన్‌ చూసి ఆశ్చర్యపోయా.

భారీ తారాగణం నటిస్తున్నారని చెప్పినప్పుడు ఎలా ఫీల్‌ అయ్యారు?

ప్రియాంక దత్‌: ‘కల్కి’ గురించి నాగ్‌ అశ్విన్‌ చెప్పినప్పుడు రెండు రోజులు నిద్ర పోలేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను ఎలా తెరకెక్కించాలి అని చాలా టెన్షన్‌ పడ్డాం. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం.
స్వప్న దత్‌: ఇందులోభాగమైన అగ్ర నటీనటులందరూ చాలా సహకరించారు. అన్ని విషయాల్లో ప్రోత్సాహం అందించారు. ముఖ్యంగా ప్రభాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి.

మేకప్‌ వేసుకొనేందుకు ఎంత సమయం పట్టింది?

అమితాబ్‌: మేకప్‌ వేయడం సామాన్యమైన విషయం కాదు. నా మేకప్‌ వేయడానికి ఆర్టిస్టుకు మూడు గంటలు పట్టేది. దాన్ని తీసేయడానికి గంటన్నర పట్టేది. నేనెప్పుడు దాన్ని టార్చర్‌లా భావించలేదు. తెరపై చూస్తే దానివెనక దాగివున్న కష్టం కనిపిస్తుంది.

కమల్‌హాసన్‌తో కలిసి వర్క్‌ చేయడం ఎలా ఉంది?

దీపికా పదుకొణె (Deepika Padukone): మొదటిసారి కమల్‌హాసన్‌ను సెట్‌లో చూడగానే ఆశ్చర్యపోయాను. చిన్నపిల్లలా నాగ్‌ అశ్విన్‌కు ఫోన్‌ చేసి.. కమల్‌గారు వచ్చేశారు అని చెప్పాను.

అమితాబ్‌ బచ్చన్‌తో స్క్రీన్‌ పంచుకోవడం ఎలా అనిపించింది?

ప్రభాస్‌: చిత్రీకరణ మొదటిరోజే అమితాబ్‌కు, (Amitabh Bachchan) నాకు మధ్య ఫైట్ సన్నివేశం. వయసుతో సంబంధం లేదు అని ఆయన నిరూపించారు. 25ఏళ్ల యువకుడు ఎంత ఉత్సాహంగా ఉంటాడో అమితాబ్ అలా ఉంటారు.
అమితాబ్‌: ఈ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడడానికి నాగి (నాగ్ అశ్విన్‌) నా దగ్గరకు వచ్చినప్పుడు నా పాత్ర, ప్రభాస్‌ పాత్ర వివరించారు. ఇందులో ప్రభాస్‌పై పోరాడే వ్యక్తిని నేను. ప్రభాస్‌ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించాలి. చేతులు జోడించి మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను. సినిమాలో నేను మీ హీరోతో ప్రవర్తించిన తీరుకు నన్ను తిట్టుకోకండి. అది సినిమాలో భాగమంతే. (ప్రభాస్‌: వాళ్లందరూ మీ అభిమానులు కూడా అందుకే ఏమీ అనుకోరు).

‘కల్కి’ ఎవరు? ఆ అవతారం ఎప్పుడు వస్తుంది?సినిమాలో ఏం చూపించబోతున్నారు?

విజువల్స్‌ గురించి చెప్పండి?

అమితాబ్‌: కొన్ని విజువల్స్‌ నమ్మశక్యం కావు. అన్నింటిని తెరపై అద్భుతంగా చూపించారు. ఇంతగొప్ప ప్రాజెక్ట్‌లో భాగమవడం నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అనుభవం. నాగ్అశ్విన్‌ ఈ కథ చెప్పి వెళ్లిన తర్వాత ‘ఇతను ఏం తింటున్నాడు. ఇంత గొప్పగా రాశాడు’ అని నేను చాలాసేపు ఆలోచించాను.

మీ పాత్ర ఎలా ఉంటుంది?

ప్రభాస్‌ (Prabhas): కల్కిలో నా పాత్రలో చాలా ఎమోషన్స్‌ ఉంటాయి. సూపర్‌ హీరోలా ఉంటుంది. ఇది నా కెరీర్‌లోనే బెస్ట్‌ క్యారెక్టర్‌. 

సెట్‌లో ఎంజాయ్‌ చేశారా?

కమల్‌ హాసన్‌: నేను ఎక్కువగా సైలెంట్‌గా ఉండడాన్ని ఇష్టపడతాను. కల్కి సెట్‌లో అందరూ క్రమశిక్షణతో ఉండేవారు. నాగ్ అశ్విన్‌ ఎంత చిన్నగా మాట్లాడినా సెట్‌ అంతా వినిపించేది. అంత ప్రశాంతంగా ఉండేది. అందుకే నేను ఎంజాయ్‌ చేశాను. చాలా సినిమాల చిత్రీకరణ సమయాల్లో ఇలా ఉండదు. గోలగోలగా ఉంటుంది. మన సినిమా చూసి థియేటర్లో ఫ్యాన్స్‌ సందడి చేయాలి. కానీ, మనం సెట్‌లో గోల చేయకూడదు కదా(నవ్వుతూ).

మొదటిసారి తెలుగు సినిమాలో నటించడం ఎలా అనిపించింది? 

దీపికా పదుకొణె: నటీనటులకు భాషతో సంబంధం ఉండదు. అభిమానులకు వినోదాన్ని పంచడమే వారి లక్ష్యం. నేనెప్పుడూ ఇదే భావిస్తాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని