Radheshyam: ఇక ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండమ్మా..!

ప్రేమ, విధికి మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపిస్తూ తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ఈసినిమా విడుదలపై గత కొన్నిరోజుల నుంచి ఎన్నో ప్రచారాల...

Updated : 02 Feb 2022 09:37 IST

రిలీజ్‌పై చిత్రబృందం ఫుల్‌ క్లారిటీ

హైదరాబాద్‌: ప్రేమ, విధికి మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపిస్తూ తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ఈసినిమా విడుదలపై గత కొన్నిరోజుల నుంచి ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం డైరెక్ట్‌ ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇటీవల నెట్టింట్లో గట్టి ప్రచారమే జరిగింది. కాగా, ఆ ప్రచారాలన్నింటికీ చిత్రబృందం బుధవారం ఉదయం ఫుల్‌స్టాప్‌ పెట్టింది. థియేటర్‌ రిలీజ్‌పై అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఆంక్షలు ఎత్తివేస్తున్నారు.  ప్రేక్షకులు సైతం థియేటర్లకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’, ‘భీమ్లానాయక్‌’ చిత్రబృందాలు మరోసారి రిలీజ్‌ డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి నింపాయి. ఈ తరుణంలో తాజాగా ‘రాధేశ్యామ్‌’ టీమ్‌ విడుదల తేదీని ప్రకటించేసింది. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ వెల్లడించింది. చిత్రబృందం ప్రకటనతో ప్రభాస్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇకనైనా ఓటీటీ రిలీజ్‌ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండమ్మా’ అని పోస్టులు పెడుతున్నారు. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రభాస్‌ హస్తసాముద్రిక నిపుణుడిగా విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నాడు. ఇక, పూజాహెగ్డే ప్రేరణగా అలరించనున్నారు. అనుకోకుండా ప్రేమలో పడిన వీరిద్దరిని విధి ఒక్కటి చేసిందా? లేక దూరం చేసిందా? ప్రేమను గెలుచుకునేందుకు వీరిద్దరూ విధితో చేసిన పోరాటమేమిటి? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని