Prabhas: ఒకే వీడియోలో ఇటు కృష్ణంరాజు.. అటు ప్రభాస్‌.. రెండు కళ్లు సరిపోవటం లేదు!

కథానాయకుడు ప్రభాస్‌ (Prabhas) తన పెదనాన్న కృష్ణంరాజు (krishnam raju)ను గుర్తు చేసుకున్నారు.

Published : 25 Sep 2022 01:27 IST

హైదరాబాద్‌: కథానాయకుడు ప్రభాస్‌ (Prabhas) తన పెదనాన్న కృష్ణంరాజు (krishnam raju)ను గుర్తు చేసుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇటీవల తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్‌ అభిమానులు చేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. అందులో ఒకవైపు కృష్ణంరాజు నటించిన చిత్రాలలోని పాత్రలు, మరోవైపు ప్రభాస్‌ నటించిన చిత్రాలలోని సన్నివేశాలను ఒకదానితో ఒకటి కలిసేలా మిక్స్‌ చేసిన విధానం బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ అభిమానులను కట్టిపడేస్తోంది. ‘ఎడిటింగ్‌ చాలా బాగుంది’, ‘సేమ్‌ మేనరిజం’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు ప్రభాస్‌ ‘సలార్‌’ (Salaar) చిత్రాన్ని పునఃప్రారంభించారు. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో తాజాగా ప్రారంభమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని