‘రాంబో’లో టైగర్‌కి బదులుగా ప్రభాస్‌?

సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడిగా ‘రాంబో’ సినిమా చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన ‘రాంబో’ చిత్రానికి ఇది రీమేక్‌.

Published : 31 Mar 2021 20:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడిగా ‘రాంబో’ సినిమా చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన ‘రాంబో’ చిత్రానికి ఇది రీమేక్‌. అంతేకాదు సినిమాకు సంబంధించి పోస్టర్ సైతం సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేసింది. టైగర్‌ ష్రాఫ్‌ - హృతిక్‌ రోషన్‌ కలిసి నటించిన ‘వార్‌’ చిత్రం తర్వాత చిత్రాన్ని పట్టాలెక్కించాలని సిద్ధార్థ్ ఆనంద్‌ భావించాడట. అయితే టైగర్‌ ‘రాంబో’ కోసం కాల్షీట్స్ ని సర్దుబాటు చేయడం లేదట. దాంతో ‘బాహుబలి’ నటుడు ప్రభాస్‌ని ‘రాంబో’ సినిమా కోసం దర్శకుడు సిద్ధార్థ్ సంప్రదించాడట. కథతో పాటు వారు చెప్పిన కాన్సెప్ట్ ప్రభాస్‌కి నచ్చిందట. ‘రాంబో’ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని