Prabhas: పూజాతో ముద్దు సీన్లు.. ప్రభాస్‌ ఏమన్నారంటే..?

‘రాధేశ్యామ్‌’ సినిమా కోసం పూజాహెగ్డేతో కలిసి కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడంపై ప్రభాస్‌ స్పందించారు. కిస్‌ సీన్లు చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపించిందని...

Updated : 05 Mar 2022 13:38 IST

హైదరాబాద్‌: ‘రాధేశ్యామ్‌’ సినిమా కోసం పూజాహెగ్డేతో కలిసి కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడంపై ప్రభాస్‌ స్పందించారు. ముద్దు సీన్లు చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపించిందన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని బయటపెట్టారు. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈసినిమాలో ప్రభాస్‌.. తన ప్రేయసి పాత్రలో నటించిన పూజాహెగ్డేని ముద్దు పెట్టుకున్నట్లు ప్రచార చిత్రాల్లో చూపించారు.

‘‘ఇదొక లవ్‌స్టోరీ కాబట్టి దర్శకుడు అలాంటి సన్నివేశాలు రాయాల్సి వచ్చింది. స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేస్తున్నప్పుడు అలాంటి సీన్లు చేయలేనని చెప్పలేను. కమర్షియల్‌ సినిమాలో అయితే రొమాంటిక్‌ సన్నివేశాలు వద్దనుకుంటే.. చెప్పి తొలగించేయవచ్చు. కానీ, ఇలాంటి ప్రేమకథా చిత్రాలకు అది కుదరని పని. ముద్దు సన్నివేశాలు ఒక్కటే కాదు.. సెట్‌లో ఉన్న వాళ్లందరి ముందు చొక్కా లేకుండా నటించాలంటే ఇప్పటికీ ఇబ్బందిగానే ఉంటుంది. షర్ట్‌ లెస్‌ సీన్లు ఉన్నప్పుడు సెట్‌లో మొత్తం ఎంతమంది ఉన్నారా? అని చెక్‌ చేసుకుంటా. అక్కడ చాలా మంది ఉంటే.. దర్శకుడితో మాట్లాడి ఆ సీన్ల వరకూ వేరే ఎక్కడైనా షూట్‌ చేయమని అడుగుతా’’ అని ప్రభాస్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని